ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుళ నిరీక్షణగా ఉన్న జనాభా లెక్కల సేకరణ (జనగణన) ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.ఇంటింటి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను 2027 జనవరి 25 నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.ఈసారి జనగణనలో సరికొత్తగా సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ (స్వయం నమోదు) విధానంలో తమ వివరాలను నమోదు చేసుకునేందుకు 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రత్యేక యాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా అవకాశం కల్పించనున్నారు.

