పులివెందులలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉందో ప్రపంచమంతటికీ తెలుసని, అక్కడ పర్యటించిన సమయంలో తనపైనే దాడులకు తెగబడ్డారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస, భయాందోళనలు, అణచివేత ధోరణులతో కూడిన రాజకీయాలకు పులివెందుల వేదికగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన కుప్పంలో ప్రజల సాధు స్వభావాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల అవసరమే లేకుండా జీవించేంతటి ప్రశాంతమైన వాతావరణం ఉందని వ్యాఖ్యానించారు.