ఓ కంపెనీ సీఈఓ చేసిన ఒక్క అనైతికపనితో ఇన్వెస్టర్లకు బిలియన్ల కొద్దీ నష్టం వాటిల్లింది. సోమవారం సాయంత్రం అమెరికా మార్కెట్లు ముగిసే సమయానికి షేరు ధర 4.27 శాతం పతనమై, 178.67 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో కొంత సేపు దాదాపు 8 శాతానికి పైగా పడింది. ఈ క్షీణతతో ఎన్విడియా మార్కెట్ విలువలో రూ.18 లక్షల కోట్లుకు పైగా సంపద ఆవిరైంది. జెన్సన్ హువాంగ్ ఎన్విడియా సీఈఓ మాత్రమే గాకుండా.. ఏఐ విప్లవంలో కీలక వ్యక్తిగా పరిగణిస్తుంటారు