కొద్దిదూరం పాదయాత్రగా పీఎస్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాదయాత్రగా వస్తున్న అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి విచారణ వార్త తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముద్రగడ గిరిబాబుతో కలిసి కిర్లంపూడి పీఎస్ కు చేరుకోగా అధికారులు ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు.