జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. తెలుగుదేశం పార్టీ 406, వైకాపా 76, జనసేన 73, భారతీయ జనతా పార్టీ 20, స్వతంత్రులు 6, సీపీఐ(ఎం) ఒక స్థానంలో విజయం సాధించాయి. 7,768 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. తెలుగుదేశం 4,806, వైకాపా 1,711, జనసేన 938, భాజపా 117, స్వతంత్రులు 169, కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) 15, బీఎస్పీ 3 స్థానాల్లో గెలుపొందాయి.