జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు దీపావళి పండుగ శోభ నెలకొంది. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో స్థానికులు వందల సంఖ్యలో దీపాలను వెలిగించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సరిహద్దు పోస్టులు దీపాల వెలుగులతో కాంతులీనాయి. కొన్నిచోట్ల సైనికులు మిఠాయిలు పంచుకొని వేడుకలు జరుపుకున్నారు. దిల్లీలో స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలకరించారు. లోథి ఎస్టేట్, గోలె మార్కెట్ తదితర ప్రాంతాల్లో స్థానికులు బాణసంచా కాల్చారు. మరోవైపు, పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.