ఆఫ్రికా దేశం సెనెగల్ తీరంలో వలసదారులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కనీసం 21 మంది మరణించారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఘటనా ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. రాజధాని డాకర్కు ఉత్తరాన ఉన్న కెబెమెర్ పట్టణ తీరంలో ఈ బోటు మునిగిపోయిందని తెలిపారు. సోమవారం సెనెగల్ హోం మంత్రి ఘటనా ప్రాంతాన్ని సందర్శించనున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

