ఈజిప్టులోని గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. గిజా నుంచి ఫయూమ్ వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలు.. కైరో నుంచి అస్వాన్ వెళ్తున్న మరో ప్యాసింజర్ రైలును వెనక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 88 మందికి గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పాయి. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఆదేశించారు.