ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని పర్సాపూర్లో పర్యటించారు. లబ్ధిదారుల సుమిత్ర, శ్రీనివాస్ దంపతులకు వస్త్రాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. వారి ఇంట్లోనే మంత్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అక్కడే ఉన్న చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.