తన సోదరి టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వీడియో వైరల్ కావడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఆమె తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తోందని, గౌరవప్రదంగా జీవనం సాగిస్తోందని అన్నారు. టీ కొట్టు నడుపుకోవడమంటే ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టే కదా అన్న విలేకరి ప్రశ్నించగా తాను యోగినని యూపీ సీఎం చెప్పారు. కాబట్టి, తాను కుటుంబాన్ని కేవలం సంప్రదాయ కోణంలో మాత్రమే చూడనని చెప్పారు. రాష్ట్రంలోని 25 కోట్ల మంది ప్రజలు తన కుటుంబసభ్యులేనని అన్నారు.