సికింద్రాబాద్‌లో దీపావళి వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. సీతాఫల్‌మండిలో బాణసంచా కాలుస్తుండగా ఓ రాకెట్ అదుపు తప్పి సమీపంలోని క్రాకర్స్ దుకాణంలోకి దూసుకెళ్లింది. అప్పటికే పెద్ద మొత్తంలో బాణసంచా నిల్వ ఉండటంతో రాకెట్ నిప్పు తగలగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దుకాణంలోని టపాసులన్నీ వరుసగా పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. చూస్తుండగానే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, పేలుళ్ల శబ్దాలతో భీతావహంగా మారింది. దీంతో సీతాఫల్‌మండిలో కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.