తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల్లో YSRCP అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మిపై 602 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరగడంతో తాము రీకౌంటింగ్‌కు వెళ్దామని భావించామని.. అయితే చెవిరెడ్డి బెగ్ చేసుకుంటే వదిలేశామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాళ్లు ఇద్దరు ఎన్నికల్లో ఓడిపోయారు. చిన్న కొడుకు కూడా ఓడిపోతే డిప్రెషన్లోకి వెళ్లిపోతారని రిక్వెస్ట్ చేసుకుంటే.. ధనలక్ష్మి పెద్ద మనసుతో వదిలేసింది అని సుధారెడ్డి తెలిపారు.