బాలీవుడ్ ప్రముఖ నటి రాధికా ఆప్టే దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది సినిమాల షూటింగ్ సెట్స్‌లో ఎక్కువ శాతం పురుషులే ఉండేవారని, వారు మాట్లాడే భాష తనకు అర్థం కాకపోవడంతో తీవ్రమైన ఒంటరితనానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సినిమాల షూటింగ్ సమయంలో సరైన అగ్రిమెంట్లు ఉండేవి కాదని, ముందుగా స్క్రిప్ట్ కూడా ఇచ్చేవారు కాదని రాధికా ఆప్టే ఆరోపించారు.