మహిళల ఆశీర్వాదం వల్లే ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా హకీంపేట్‌లో స్వయం సహాయక సంఘాల సమావేశానికి సీఎం హాజరై మాట్లాడారు. ‘‘నేను అడిగినదానికంటే ఎక్కువే ఆడబిడ్డలు నాకు ఇచ్చారు. నేను ఇంకా కొత్తగా కోరుకునే పదవులు ఏమీ లేవు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే నా జీవితలక్ష్యం. అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణను.. విద్యార్థుల యూనిఫామ్‌లు కుట్టిచ్చే వ్యాపారాన్నీ మహిళలకే ఇచ్చాం’’ అని తెలిపారు.

