గత పన్నెండేళ్లలో దేశ మౌలిక స్వరూపం, ప్రజాస్వామ్యం, సంస్థలకు తీవ్ర నష్టం జరిగిందని సోనియా గాంధీ అన్నారు. ఈ పరిణామాలను ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, సుపరిపాలనను తిరిగి తీసుకురాగల సామర్థ్యం భారత ఓటర్లకు ఉందని తనకు విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా వ్యవస్థలను పునరుద్ధరించడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. ఇందుకు కొంత సమయం పడుతుందని, రాజకీయ పార్టీల నుంచి గట్టి ప్రయత్నం అవసరమని అభిప్రాయపడ్డారు.