జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంటి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్రా-తోర్పా రహదారి మార్గంలో అతివేగంతో వచ్చిన ఓ లారీ అదుపుతప్పి రహదారి పక్కన నిలబడి ఉన్న జనంపైకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే ప్రాంతంలో ఒక స్కూటీ బోల్తా పడి పక్కనే ఉన్న పొదల్లో పడిపోవడంతో స్థానిక గ్రామస్థులు, మహిళలు, పిల్లలు సహాయం చేయడానికి, ఏం జరిగిందో చూడటానికి రోడ్డు పక్కన గుమిగూడిన జనాలవైపు దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది.