పోలవరం తొలిదశ ఎప్పుడు పూర్తి అవుతుందో తేల్చి చెప్పేందుకే ఆ ప్రాజెక్టు అథారిటీ (PPA) ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి, డిజైన్ల ఆమోదం, ఏ విభాగంలో పని పరిమాణం ఎంతుంది? 2027 మార్చి నెల దాటి ఇంకా ఎంతకాలం సమయం పడుతుంది? అన్న అంశాలను కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్రజల్శక్తిశాఖ అనుమతి ఇస్తేనే 2027-28 కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేసేందుకు వీలు ఉంటుంది.