విజయవాడ వద్ద కృష్ణా నదిపై కొత్తగా మరో రైల్వే వంతెన నిర్మాణానికి అనుమతి లభించింది. విజయవాడ జంక్షన్-కృష్ణా కెనాల్ జంక్షన్ స్టేషన్ల మధ్యలో విజయవాడ-సీతానగరం మధ్య ఈ కొత్త వంతెన రానుంది. బల్లార్ష-ఖాజీపేట-విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇందులో విజయవాడ నుంచి గూడూరుకు 293 కి.మీ. నాలుగో లైన్ నిర్మాణానికి రూ.5,858 కోట్లతో డీపీఆర్ రూపొందించి బోర్డుకు పంపారు. ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 1.30 కిలో మీటర్ల పొడవైన మరో రైల్వే వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు.