కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్.. తన భార్య, ఆమె బంధువులు సహా ఏడుగురిని దారుణంగా హత్య చేశాడు. తమ వివాహ బంధంలో భార్య తరపు బంధువులు జోక్యం చేసుకుంటున్నారని శేఖర్ కొన్నేళ్లుగా అసంతృప్తితో ఉన్నాడు. ఆ వ్యవహారం వారి మధ్య గొడవలకు కారణమైంది. దాంతో భార్య సహా ఆమె బంధువులను రోకలితో కొట్టి చంపాడు. తర్వాత మృతదేహాలను నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. అక్టోబర్ 17 నుంచి ఒక్కొక్కరిని ఇంటికి రప్పించి ఈ హత్యలు చేయడం ప్రారంభించాడని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.