సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత గురువారం సాయంత్రం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు నవంబర్ నెలాఖరులోగా రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరిలో నీటి ప్రవాహం, ఎత్తిపోతల ప్రక్రియపై క్షేత్రస్థాయి వివరాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ప్రాజెక్టుకు చేపడుతున్న మరమ్మతుల గురించి, కాళేశ్వరం నుంచి ఏపీకి నీటిని తరలించారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు.