కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండలోని బూత్-2లో రిగ్గింగ్ జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపించడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. మరోవైపు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పర నినాదాలతో మొదలైన వివాదం తోపులాటకు దారితీయడంతో ఓటర్లు, మహిళలు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.