loader

ఏపీ వ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల, ఎర్రకోట, రాళ్లదొడ్డి, సిరాలదొడ్డి, గువ్వలదొడ్డి గ్రామాల్లో నాలుగు దశాబ్దాలు తర్వాత పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి పట్టు ఉండడంతో 40 సంవత్సరాలు ఏకగ్రీవమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ గ్రామాల్లో ఇవాళ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓపికగా లైన్లలో నిలబడి ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON