ఐపీఎల్-2027కు ముందు ఎస్ఆర్హెచ్, సీఎస్కే జట్ల మధ్య నలుగురు ప్లేయర్ల మార్పిడికి ఒప్పందం కుదిరింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.6 కోట్లు.. తగ్గించిన ఫీజుతో), ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ (రూ.3 కోట్లు) సన్‌రైజర్స్ నుంచి చెన్నై జట్టులోకి మారారు. భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ (రూ.4.8 కోట్లు), ఆస్ట్రేలియా ప్లేయర్ నాథన్ ఎల్లిస్ (రూ.2 కోట్లు) చెన్నై నుంచి ఎస్ఆర్హెచ్ జట్టులోకి వచ్చారు. ఐపీఎల్ 2026 వేలంలో ఎస్ఆర్హెచ్ రూ.13 కోట్లకు లివింగ్ స్టోన్‌ను దక్కించుకుంది.