చిత్తూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు సుమారు 50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల బయట కొందరు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు.