ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసరడం కాదని, నిజంగా చర్చ జరపాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రధానికి అధికారికంగా లేఖ రాయాలని రాహుల్కు సూచించారు.చర్చించడానికి తాము ఏమాత్రం వెనుకాడబోమని, ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వ్యవహారంతో పాటు ఏ అంశంపైనైనా సభలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.