సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుుడుతోంది. ఇప్పటివరకు ప్రధాన ప్రామాణికంగా ఉన్న ఆధార్ మరియు రేషన్ కార్డుల స్థానంలో ఇకపై ‘ఓటరు ఐడీ’ని ప్రామాణికంగా తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి లలన్ సింగ్ ప్రకటించారు. ఇకపై సంక్షేమ పథకాల ద్వారా అందే ఆర్థిక సహాయం లేదా చెల్లింపులు పొందాలంటే లబ్దిదారులు తమ ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌తో పాటు బయోమెట్రిక్ వివరాలను విధిగా సమర్పించాల్సి ఉంటుంది.