కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలపై ఇవాళ కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. విదేశీ నిధులతో నడిచే ఎన్జీవోలు, డీప్ స్టేట్ ఆపరేటివ్‌లు, భారత్ వ్యతిరేక శక్తులు వీళ్లను నడిపిస్తున్నాయని, నిధులు అందుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అభిజీత్ దిప్కేకు అమెరికాలో ఉన్న దాతల నుండి నిధులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. అలాగే అశుతోష్ రాంకాకు పాకిస్థానీ రాజకీయ నాయకుల నుండి డబ్బులు అందాయని పేర్కొన్నారు.