ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలకులు తమ సంపదను పెంచుకుంటున్నారని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం హైదరాబాద్‌ను కామధేనువులా ఉపయోగించుకుంటోందని విమర్శించారు. భూములు, దందాలపైనే ప్రభుత్వ పెద్దలకు ఆసక్తి ఉందని, ప్రజా సమస్యలపై పట్టింపు లేదని, గత మూడేళ్లలో అయ్యప్ప సొసైటీలో సుమారు 700 అక్రమ నిర్మాణాలు జరిగాయని విమర్శించారు.ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తూ 8, 9 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, సీఎం కుటుంబ సభ్యులే దగ్గరుండి అక్రమ నిర్మాణాలు కట్టిస్తున్నారని మండిపడ్డారు.