తెలుగు రాష్ట్రాల్లో మురసు తుఫాన్ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఏపీ, తెలంగాణను అత్యంత భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.