రాజస్థాన్ నాగౌర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక బాణసంచా గోదాంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి దాదాపు రెండు కిలోమీటర్ల పరిధి వరకు శబ్దం బలంగా వినిపించడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.