ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో సముద్రంలో వేటకు వెళ్లి బోటు ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్న ఒక మత్స్యకార బోటు సముద్రపు అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. తీరానికి చేరుకున్న ఆ పడవలో నాలుగు మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే పోలీసులకు, మెరైన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో మొత్తం 15 మందికి పైగా మత్స్యకారులు ఉన్నట్లు భావిస్తున్నారు. తీరానికి వచ్చిన బోటులో 4 మృతదేహాలు లభించగా, మిగిలిన వారంతా సముద్రపు ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.