ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంపై మోదీ ఆరా తీశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి గురించి చంద్రబాబును మోదీ అడిగి తెలుసుకున్నారు. ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ప్రధానికి చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు.