ఒమన్ తీరానికి సమీపంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌక ‘ఎంఎస్‌వి అల్ జుసుఫీ’ గుర్తుతెలియని వైమానిక వస్తువు దాడికి గురైంది. ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన భారతీయ నావికుడు గంధర్ నహీమ్ అజీజ్ ప్రాణాలు కోల్పోయారు. నౌకలో మొత్తం 14 మంది భారతీయ సిబ్బంది ఉండగా, ఒమన్ కోస్ట్ గార్డ్ 13 మందిని సురక్షితంగా రక్షించింది. తీవ్రంగా గాయపడిన మరో నావికుడు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు
మిగిలిన సిబ్బందికి అవసరమైన సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.