నేపాల్‌లోని విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సోలుఖుంబు జిల్లాలో ప్రమాదవశాత్తు రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ భారత జాతీయుడు మరణించగా, మరో ప్రయాణికుడు గాయపడ్డాడు.ఎయిర్ డైనస్టీ, ఫిష్‌టెయిల్ ఎయిర్‌కు చెందిన హెలికాప్టర్లు ఉదయం 8.11 గంటల ప్రాంతంలో ఢీకొన్నాయి. ఫెరిచే హెలిప్యాడ్‌లో ల్యాండింగ్ అవుతుండగా రెండు హెలికాప్టర్ల రోటర్లు ఢీకొన్నాయని అథారిటీ సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు