ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని దాటిన మురసు తుపాను ఈదురుగాలులు, జోరువానతో తీర ప్రాంతాలపై విరుచుకుపడింది.ప్రకాశం జిల్లాల్లో బీభత్సం సృష్టించింది.ఒంగోలులో అర్ధరాత్రి నుంచే తుపాను ప్రభావం మొదలైంది. భీకరగాలులకు సాయిబాబా గుడి వద్ద భారీ చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. విద్యుత్ స్తంభంపై చెట్టు విరిగిపడటంతోవిద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఒంగోలు గాంధీ పార్కు సమీపంలో వర్షపు నీరు రోడ్డుపైకి చేరింది. ఒంగోలు కలెక్టరేట్ వద్ద రహదారిపై భారీ వృక్షం విరిగిపడింది. చెట్టు పడి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం దెబ్బతింది.