ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో.. కీలక దశకు కౌంట్‌డౌన్ స్టార్టయ్యింది.92 పురపాలికల్లో పోలింగ్ జరగగా.. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో 556 కౌంటింగ్ హాల్స్.. 6 వేల 831 కౌంటింగ్ టేబుల్స్‌ను సిద్ధం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు 6 వేల 831 మంది సూపర్‌వైజర్లు ఉంటారు. కౌంటింగ్ కోసం 13వేల 662 మంది సిబ్బంది ఉంటారు. ఓట్ల లెక్కింపులో 27 వేల 324 మంది అసిస్టెంట్లు పాల్గొంటారు.