తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చేశారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ ప్రజలు దీన్ని ఎప్పటికీ క్షమించబోరన్నారు. తెలంగాణలో అవినీతిని కాంగ్రెస్ పార్టీ నిరోధించడానికి బదులు రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టిందన్నారు. ఇక్కడ అవినీతిని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు నిర్మూలించలేవని.. బీజేపీ పార్టీ మాత్రమే ఆ పని చేయగలదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే అది సాధ్యమన్నారు.

