ఏపీలో పుర ఎన్నికలకు సంబంధించి నాలుగు పోలింగ్ కేంద్రాల్లో(మూడు చోట్ల) రీ పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశించింది. పల్నాడు జిల్లా మాచర్ల 23వ వార్డులోని రెండు బూత్‌ల్లో, ప్రకాశం జిల్లా చీమకుర్తి 14వ వార్డులోని ఒక బూత్‌లో రీపోలింగ్‌కు ఆదేశించింది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్లో ఒక చోట రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎస్ఈసీ పేర్కొంది.