ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాపాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఒక్క జ్ఞానేష్ కుమార్ కోసం ఎంతోమందిని జైలులో పెడుతున్నారని అన్నారు. ‘ఛలో ఢిల్లీ’ నిరసనలతో దేశ రాజధాని హోరెత్తింది. ఎన్నికల కమిషనర్‌ను అడ్డుపెట్టుకుని బిజెపి పలు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘మోదీ హఠావో.. దేశ్ కీ బచావో’ అంటూ ఖర్గే నినదించారు.

