అనంతపురంలో దొంగ ఓట్ల రచ్చ నడుస్తుంది. హమాలి కాలనీలో రిగ్గింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం కూటమి నాయకులు రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడుతున్నారని వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపించింది. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతలను అడ్డుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు.

