ఎన్నికల విధుల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల విధుల పారితోషికాన్ని పెంచడంతో పాటు.. విధి నిర్వహణలో ప్రమాదాలు సంభవిస్తే అందించే పరిహారంలోనూ మార్పులు చేసింది. కేటగిరీల వారీగా గతంలో ఉన్న పారితోషికాలను సవరిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జీవోలు 1345, 1346 జారీ చేశారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పెరిగిన పారితోషికంతో పాటు ప్రమాద పరిహారంలోనూ ప్రయోజనం కలగనుంది.