అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, అగ్ర నటుడు రామ్చరణ్ సతీమణి ఉపాసన చిత్తూరులో అపోలో విద్యాసంస్థల ద్వారా 5,900 మంది విద్యనభ్యసిస్తుండటం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.త్వరలోనే అర్ధగిరి ఆలయంలో ‘రామ రక్షా’ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. తన తాతయ్య, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి పుట్టిన నేలతో తనకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని
ఉపాసన గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ వీడియోను షేర్ చేశారు.