నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్‌కు పాల్పడ్డ తహసీల్దార్ పై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ సునీతను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయ్యవారిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 115లో 13.17 గుంటల భూమి అక్రమంగా ఇతరుల పేర్లపై నమోదైనట్లు, సర్వే నంబర్ 115లో భూ రికార్డుల నమోదుకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.