ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహణలో ఉన్న 11 ప్రధాన విమానాశ్రయాలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 2026 నాటికి గ్లోబల్ బిడ్లను ఆహ్వానించాలని యోచిస్తోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా-గగ్గల్,ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారణాసి,ఖుషినగర్,బీహార్‌లోని గయా, ఒడిశాలోని భువనేశ్వర్, కర్ణాటకలోని హుబ్బళ్లి, నాలుగో బండిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్), తమిళనాడులోని తిరుచిరాపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి విమానాశ్రయాలు.