దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద 24వ విడత డబ్బులను విడుదల చేసింది. దీంతో కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది. ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది అందే ఆర్థిక సాయం లభిస్తోంది. శుక్రవారం గుజరాత్లోని బనస్కాంతలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ పథకం 24వ విడత నిధులను విడుదల చేశారు. మొత్తం రూ.18,690 కోట్లను 9.34 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు.