అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. పంట పొలాల్లో ఉన్న గ్యాస్ పైప్‌లైన్ నుంచి మరోసారి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 26వ తేదీన ఇదే ప్రాంతంలో గ్యాస్ పైప్‌లైన్ లీకై కలకలం సృష్టించగా, తాజాగా అదే పైప్‌లైన్ మరోసారి లీక్ కావడం గ్రామస్తుల్లో ఆందోళనకు కారణమైంది. పైప్‌లైన్ నుంచి గ్యాస్ ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించింది.