కిందటి రోజు భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంచి లాభాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి విరుద్ధంగా అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. అక్కడ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ షేర్లు భారీగా పతనం కావడంతో ఇతర టెక్ స్టాక్స్‌లోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సూచీలు నష్టపోయాయి. ఇక్కడ గూగుల్ స్టాక్ ఒక్కరోజులో సుమారు 13 శాతం వరకు పడిపోగా ఇన్వెస్టర్ల సంపద రూ. 45 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.