కజకిస్థాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మనీషా బన్వాలా (59 కేజీలు) ఫైనల్‌కు దూసుకెళ్లింది. 29 ఏళ్ల మనీషా గురువారం జరిగిన సెమీ ఫైనల్లో అల్టిన్ షగాయేవా (కజకిస్థాన్)ను 10-0 తేడాతో ఓడించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో అబిగైల్ నెట్టె (అమెరికా)తో మనీషా తలపడనుంది. ఇక, 72 కేజీల విభాగంలో తను శర్మ కాంస్యం సాధించింది. ఈ 20 ఏళ్ల అమ్మాయి కాంస్య పతక పోరులో 9-5 తేడాతో ప్రెషియస్ బెల్ (అమెరికా)ను ఓడించింది.