స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం సృష్టించిన అరాచకంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నామినేషన్ల పరంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. దీనికోసం పార్టీపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ చూడని దారుణాలు చంద్రబాబు ప్రభుత్వంలో చూస్తున్నాం. నామినేషన్ల సమయంలోనే ఇన్ని దారుణాలు జరిగాయి. నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం తొలిసారిగా చూస్తున్నాం. నామినేషన్లలోనే రిగ్గింగ్ చేయడం చూశాం. అభ్యర్థులపై దాడులు చేశారు. పోలీసుల అండదండలతో ఈ దాడులు జరిగాయి.

