దేశవ్యాప్తంగా 24 చోట్ల ఒమేగా హాస్పిటల్స్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారుల విస్తృత సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు కీలక డాక్టర్ల ఇళ్లపై కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ లలోని ఒమేగా హాస్పిటల్స్ బ్రాంచీలలో దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.